కోవూరులో బాబు జోరు..దినేష్‌కు కలిసోచ్చేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అది కూడా నల్లపురెడ్డి ఫ్యామిలీ టీడీపీలో ఉన్నంతకాలం…ఆ పార్టీ హవా కొనసాగింది. ఇక ఎప్పుడైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారో, అప్పటినుంచి టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఇదే సమయంలో పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి నాయకుడు వల్ల కాస్త పార్టీ పట్టు జారలేదు. 2014 ఎన్నికల్లో పొలంరెడ్డి..నల్లపురెడ్డికి చెక్ పెట్టగలిగారు.

కానీ 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి సత్తా చాటారు..పైగా వైసీపీ అధికారంలో ఉండటంతో నల్లపురెడ్డి దూకుడుగా ముందుకెళుతున్నారు. అయితే ఓడిపోయాక పొలంరెడ్డి కొన్ని రోజులు యాక్టివ్ గా లేరు..తర్వాత నిదానంగా పార్టీలో పనిచేస్తూ వచ్చారు. అయితే పొలంరెడ్డి బరి నుంచి తప్పుకుని తన తనయుడు దినేష్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. టీడీపీ అధిష్టానం సైతం దినేష్ రెడ్డిని టీడీపీ ఇంచార్జ్ గా పెట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో కోవూరు నుంచి దినేష్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ రాజకీయాల్లో సీనియర్ అయిన నల్లపురెడికి యువ నేత దినేష్ చెక్ పెట్టగలడం సాధ్యమయ్యే పనేనా? అనేది చెప్పలేని పరిస్తితి.

కాకపోతే తాజాగా కోవూరులో చంద్రబాబు రోడ్ షోకు భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు వచ్చారు. సభ సక్సెస్ అయింది..అదే సమయంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి అక్రమాలు చేస్తున్నారని, ఆయన వల్ల ప్రజల ఇబ్బందులు పడుతున్నారని చెప్పి..చంద్రబాబు గట్టిగానే టార్గెట్ చేశారు. ఈ ఆరోపణలు ఎమ్మెల్యేపై ఎప్పటినుంచో వస్తున్నాయి..అవి ఎమ్మెల్యేకు నెగిటివ్ అవుతున్నాయి.

కానీ దినేష్ ఇంకా బలం పెంచుకోవాల్సి ఉంది..లేదంటే నల్లపురెడ్డి లాంటి సీనియర్‌కు చెక్ పెట్టడం కష్టం. ఎన్నికల వరకు పట్టు విడవకుండా పనిచేస్తే..దినేష్ రెడ్డికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది.