ఆ కార‌ణం వ‌ల్లే ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచా.. గుట్టు విప్పిన శ్రియా!

సౌత్ తో పాటు నార్త్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఫస్ట్ లాక్ డౌన్ టైం లో శ్రీయ ప్రెగ్నెంట్ అయ్యింది. 2021 జ‌న‌వ‌రిలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన శ్రియా.. ఈ ముద్దుల కూతురుకు రాధ అంటూ నామక‌ర‌ణం చేసింది.

అయితే త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని శ్రియా మీడియాకు ఏ మాత్రం లీక్ అవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. కూతురును సైతం పుట్టిన ఏడాది త‌ర్వాతే అంద‌రికీ చూపించింది. అయితే ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా గా ఉంచ‌డం వెన‌క కార‌ణం ఏంటో శ్రియా బ‌య‌ట‌ప‌ట్టింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె అస‌లు గుట్టు విప్పింది.

ప్రెగ్నెన్సీ వస్తే శరీరంలో చాలా మార్పులు వస్తాయిని, బరువు కూడా పెరుగుతార‌ని శ్రియా చెప్పుకొచ్చింది. బరువు పెరిగితే తాను బాడీ షేమింగ్ కు గురి కావ‌చ్చని, అవన్నీ మానసికంగా త‌న‌ను ఎంతో ఇబ్బందికి గురిచేస్తాయని వివ‌రించింది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నానని అందుకే ప్రెగ్నెన్సీ విషయం బయటకు చెప్పలేదని శ్రియా స్ప‌ష్టం చేసింది. ఏదేమైనా శ్రియా తీసుకున్న నిర్ణ‌యం మంచిద‌నే చెప్పాలి.