ఏపీ రాజకీయాల్లో అనుహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ కూడా రాజకీయం చేస్తుంది. మొన్నటివరకు వైసీపీ వ్యూహాలు దెబ్బకు టీడీపీ తట్టుకోలేని పరిస్తితి. కానీ నిదానంగా వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడుతుంది. అలాగే పార్టీ బలం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఓ వైపు చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ నేతలు ఇదేం ఖర్మ ప్రోగ్రాంతో ఇంటింటికి వెళుతున్నారు.
ఇక వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు టీడీపీకి కాస్త కలిసొచ్చేలా ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా కేజిఎఫ్ సినిమాతో భారతదేశ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీ రాసుకున్న యష్..లోకేష్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. సడన్‌గా ఈ ఇద్దరు కలవడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మామూలుగా యష్-లోకేష్‌కు ముందు స్నేహం ఏమి లేదు. కాకపోతే ఎన్టీఆర్-బాలయ్యలతో యష్ క్లోజ్ గానే ఉంటారు. అది సినీ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే.
మరి ఇప్పుడు లోకేష్‌తో ఎందుకు భేటీ అయ్యారనేది ఆసక్తికరంగా మారింది. అయితే జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు..యువతని టార్గెట్ చేసుకునే లోకేష్ యాత్ర కొనసాగనుంది. అయితే కేజిఎఫ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో యష్ మంచి క్రేజ్ సంపాదించారు. పైగా ఆయన గౌడ సామాజికవర్గం అని చెప్పి..ఏపీలోని గౌడ యువత..ఆయన్ని తమ హీరోగా భావిస్తున్నారు.
బీసీ ఓటింగ్ లక్ష్యంగానే యష్‌తో భేటీ అయ్యారనే టాక్ కూడా వస్తుంది. ఇక పాదయాత్ర సమయంలో యష్..లోకేష్‌కు మద్ధతుగా నిలబడతారని చెప్పి ప్రచారం వస్తుంది. అయితే యష్ రాజకీయాల్లో లేరు. కాకపోతే గత ఎన్నికల్లో కర్నాటకలో సుమలతకు మద్ధతుగా ప్రచారం చేశారు. మరి ఇప్పుడు లోకేష్‌కు మద్ధతుగా నిలబడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి లోకేష్-యష్ భేటీ రాజకీయమా? లేక వేరే రీజన్స్ ఉన్నాయా? అనేది.