ఒక సినిమా సూపర్ హిట్ అయితే మళ్లీ ఎన్ని సంవత్సరాలకు హిట్ సినిమా ఇస్తాడా అని బాలయ్య ఒకానొక టైంలో ఎంతో టెన్షన్ పెట్టాడు. నటసింహ సినిమా వస్తుందంటే హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ థియేటర్లలో వాలిపోతారు. ఆ వీరాభిమానులకు కూడా ఆరు సంవత్సరాల పాటు ఆకలితో కూర్చోబెట్టాడు బాలయ్య. లక్ష్మీ నరసింహ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి బాలయ్య ఎంతో కష్టపడ్డాడు.
ఆ సినిమా తర్వాత వరుస పెట్టి 6కు పైగా సినిమాలు తీసిన సినిమా సినిమాకు క్యారెక్టర్ లో వేరియేషన్ చూపించిన అభిమానులు ఆయన నుంచి కోరుకున్నది అది కాదు. సినిమాలు వస్తున్నాయి.. పోతున్నాయి. బాలకృష్ణ నుండి అభిమానులు కోరుకున్నది మాత్రం రావట్లేదు. ఇక ఆ టైంలోనే బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు బాలకృష్ణ నుంచి పిలుపు వచ్చింది.. అప్పుడే మొదలైంది బాలకృష్ణ – బోయపాటి కాంబో వీరిద్దరి కాంబోలో మొదటి సినిమాగా వచ్చింది సింహ.
ఈ సినిమా బాలయ్య అభిమానుల ఆరు సంవత్సరాల ఆకలిని మూవీ పోస్టర్ నుంచి బాలకృష్ణ డైలాగ్స్ దాకా ఇది కదా బాలయ్య అంటే ఇది కథ బాలయ్య మాస్ అంటే అని చెప్పుకునే విధంగా బోయపాటి బాలయ్యను ఎంతో కొత్తగా చూపించాడు. ఆ సినిమా వీరి కాంబోలో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మళ్ళీ ఈ కాంబోలో 2014లో లెజెండ్ మరో సెన్సేషన్ సినిమాగా నిలిచింది.
గత సంవత్సరం ముచ్చటగా వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమ అఖండ ఇది కూడా బాలయ్య కెరియర్ లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూడు సినిమాలతో వీరి కాంబోపై టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. త్వరలోనే అఖండకు సీక్వల్ కూడా రాబోతుందని బోయపాటి తాజాగా ప్రకటించిన విషయం అందరికితెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో ఈ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.