తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంట్రీ ఉండాలని ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుకున్నట్టుగానే ఒక క్రేజీ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజులుగా డిస్కషన్ లో ఉన్న ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి జాన్వీ కపూర్ ఫిక్సయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తనకు ఈ ఆఫర్ రాకముందే మిలీ సినిమా ప్రమోషన్స్ కి హైదరాబాదులోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.
జాన్వీ కపూర్ కూడ ఎన్టీఆర్ తో నటించేందుకు ఆసక్తి చూపడంతో మేకప్ ఇమెను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ఎంట్రీ లోకి ఇవ్వడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమా అనేసరికి ఇంకాస్త త్రిల్ గా ఫీలవుతోందని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి వినపడుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ, జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ఈ చిత్రంతో ఈ కాంబినేషన్ మొదలవుతోంది.
ఎన్టీఆర్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ కచ్చితంగా ఇక్కడ స్టార్ హీరోయిన్గా హోదా సంపాదిస్తుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇక శ్రీదేవి కూడా అంతే ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత బాలీవుడ్లోకి అక్కడ కూడా బాగానే ఆకట్టుకుంది. టాలీవుడ్ లో మాత్రం జాన్వీ కపూర్ లక్కీ ఛాన్స్ ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చిత్రంలో నటించడంపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.