సౌత్ లో నెం.1 హీరోయిన్ గా స‌మంత‌.. రిచెస్ట్ బ్యూటీ ఎవ‌రో తెలుసా?

సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న‌ సమంత.. గత కొద్ది రోజుల నుంచి అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రధాన మీడియాలోనూ ఏదో ఒక ర‌కంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

అయితే గూగుల్ లో నంబర్ వన్ హీరోయిన్ ఇన్ సౌత్ ఇండియా అని సెర్చ్ చేయ‌గా.. సమంత పేరు చూపిస్తుండ‌టం విశేషం. పుష్ప చిత్రంలోని `ఊ అంటావా` సాంగ్ తో సామ్ ఓ ఊపు ఊపేసింది. అలాగే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌ను లైన్ లో పెట్ట‌డంతో పాటు వ్యక్తిగత విష‌యాల వ‌ల్ల స‌మంత పేరు మారుమోగిపోయింది. ఈ అంశాల కార‌ణంగానే ఆమెకు నంబర్ వన్ సౌత్ హీరోయిన్ గా గూగుల్ పట్టంగడుతోంది.

అలాగే ఈ ఏడాది టాలీవుడ్ లో రిచెస్ట్ బ్యూటీ ఎవ‌రు అని సెర్చ్ చేయ‌గా.. అనుష్క శెట్టి పేరు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న మహిళా నటిగా అనుష్క శెట్టి నిలిచింది. ఇక టాలీవుడ్ లో అత్య‌ధిక ఫ్యాన్స్ క‌లిగిన హీరోయిన్ గా ర‌ష్మిక‌, మోస్ట్ సెర్చింగ్ హీరోయిన్ గా కాజ‌ల్ నిలిచారు.