శిల్పా శెట్టి హాట్ అందాలకు కుర్రకారకు చెమటలు.. ఫొటోలు వైరల్..

ప్రముఖ బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 47 ఏళ్ల వయసులో కూడా ఈ అమ్మడు అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. శిల్పాశెట్టి బాలీవుడ్ సినిమాలోనే కాకుండా టాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. త్వరలోనే ఒక తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే బాలీవుడ్ బ్యూటీ చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా యోగాసనాలతో అభిమానులను పలకరిస్తూనే ఉంది.

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేష్ బాబు సరసన శిల్లా శెట్టి రీఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. ఈ సినిమాలో శిల్ప రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలానే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో కూడా శిల్ప నటించబోతుందట. ఇక ఆ పాత్రకి సంబంధించిన వివరాలను ఇటీవలే వెల్లడించారు. శిల్ప శెట్టికి సోషల్ మీడియా లో 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ బాలీవుడ్ భామ సినిమాల నుంచి దాదాపు 7 ఏళ్ళు గ్యాప్ తీసుకొని, త్వరలోనే ‘నికమ్మ ‘ అనే సినిమాతో పాటుగా ‘హంగామా-2’ అనే సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినపుడు అంత అందంగా ఉందో ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఈ బ్యూటీ రాఘవేంద్రరావు దర్శకత్వం లో తెరకెక్కిన ‘సహస వీరుడు సాగర కన్య ‘ సినిమాలో వెంకటేష్ తో కలిసి మొదటి తెలుగు సినిమాలో నటించింది.

ఆపై మోహన్ బాబు హీరోగా నటించిన ‘వీడెవడండి బాబు’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఇక చివరిగా బాలకృష్ణ సరసన ‘భలే వాడివి బాసు’ సినిమాలో నటించింది. ఆమె తన కంటే చిన్న వాడైనా రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది.