హీరో అవ్వ‌డం కోసం చేతులు కాల్చుకున్న నిఖిల్‌.. అంత‌లా మోస‌పోయాడా?

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోల్లో నిఖిల్ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్‌ ప్రారంభించిన నిఖిల్.. పలు సీరియల్స్ లోనూ నటించాడు. ఆ తర్వాత హీరోగా మరి విభిన్నమైన కథ‌లతో ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యాడు.

రీసెంట్గా కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన నిఖిల్‌.. తాజాగా 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు సైతం మంచి స్పందన లభించింది. ఈ సంగతి పక్కన పెడితే.. నిఖిల్ హీరో అవ్వ‌డానికి చాలా కష్టాలు పడ్డాడట. కొందరి చేతిలో మోసపోయి చేతులు కూడా కాల్చుకున్నాడట. ఈ విషయాన్ని నిఖిల్‌ తాజాగా బయటపెట్టాడు.

`హీరో కావడానికి ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. కొందరికి నా యాక్టింగ్ నచ్చి ఆఫర్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ప‌ట్టించుకునేవారు కాదు. ఇంకొందరేమో రూ.50 లక్షలు, రూ. కోటి తీసుకురా హీరోను చేస్తామ‌నేవారు. అలా ఒక‌సారి నేను హీరో అవ్వడానికి రూ. 5 ల‌క్ష‌లు ఇచ్చి దారుణంగా మోసపోయాను. ఇక శేఖర్ కమ్ముల గారికి నా యాక్టింగ్ నచ్చి హ్యాపీ డేస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆయనే ఫస్ట్ చెక్ ఇచ్చారు. ఇప్పటికి దాన్ని దాచుకున్నాను. ఆ సినిమా తర్వాతే నాకు వ‌రుస అవకాశాలు వచ్చాయి` అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.