ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. అప్పుడే ఆ చానల్ పై కౌంటర్స్..!!

ఎంతోమంది యాంకర్స్ సినీ సెలబ్రిటీలు సైతం ఏదైనా ఒక్క షోలో చేస్తున్నారు అంటే ఆ షో అయిపోయే వరకు అందులోనే ఉంటారు .ఆ తర్వాత ఇతర చానల్స్ వారు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే అటువైపుగా వెళుతూ ఉండడం సర్వసాధారణమే అని చెప్పవచ్చు. అయితే అవసరాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఒక షో నుండి మరొక షో కి వెళ్తే వెంటనే వదిలేసిన షో గురించి ఇన్ డైరెక్ట్ గా పలు విమర్శలు చేయడం వంటివి తరచూ మనం చూస్తూనే ఉన్నాము.

అయితే ఇప్పటివరకు ఇలా ఎంతో మంది సెలబ్రెటీలు సైతం చేశారు. కానీ తాజాగా కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన శేఖర్ మాస్టర్ కూడా ఇలాగే చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ఎంతటి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన డాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కన్నడ హిందీ ఇతర భాషలలో సైతం కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శేఖర్ మాస్టర్ చిన్న హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేశారు. బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లలో మొదట్లో డాన్స్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ తో జడ్జిగా కూడా బాధ్యతలు చేపట్టారు. గడచిన కొద్ది రోజుల క్రితం స్టార్ మాల ప్రసారమవుతున్న కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించారు అయితే తాజాగ ఢీ షో కి ఎంట్రీ ఇచ్చారు.. అలా ఎంట్రీ ఇచ్చారో లేదో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ స్టేజి పైన ఏదో మాకు బయట కమిట్మెంట్ ఉంటే వెళ్లి వస్తాము కానీ మాకు మాత్రం ఈ కన్నతల్లి ఢీ షోనే అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇతర చానల్స్ ని సెటైర్ వేసేలా ఉన్నాయని ప్రేక్షకుల సైతం కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.