గుర్తు ప‌ట్ట‌లేనంతగా మారిపోయిన విజ‌య్ సేతుప‌తి.. లేటెస్ట్ పిక్ వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బుచ్చిబాబు తెర‌కెక్కించిన `ఉప్పెన` సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్టార్ హీరో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఆ మధ్య వరకు కాస్త బొద్దుగా కనిపించిన విజయ్ సేతుపతి.. తాజాగా స్లిమ్ గా సూపర్ హ్యాండ్సమ్ గా దర్శనమిచ్చాడు. విజయ్ సేతుపతి స్లిమ్ లుక్ ఆయ‌న‌ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు విజయ్ సేతుప‌తి లేటెస్ట్ పిక్‌ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేస్తోంది.

అస‌లు ఈ ఫోటోను చూసిన వారంతా నిజంగా విజయ్ సేతుపతియేనా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంత‌లా ఆయ‌న మారిపోయారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. త‌మిళ సినిమాల‌తో పాటు హిందీలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యారు. షారుఖ్ ఖాన్ `జవాన్` లో విజయ్ సేతుపతినే మెయిన్ విలన్ గా క‌నిపించ‌బోతున్నారు. ఇక మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టితో క‌లిసి విజ‌య్ ఓ సినిమా చేబోతున్నాడ‌ని అంటున్నారు.