ఆర్కే రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్గా కొనసాగిన ఈ భామ తర్వాత బుల్లితెరపై అలరించింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ బాగా రాణిస్తోంది. అయితే ఒకప్పుడు సినిమాలు, షోలతో.. ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌ను ఆమె నిర్లక్ష్యం చేయలేదట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజాకి గతంలో తన పిల్లలకు వండి పెట్టేంత సమయం కూడా దొరకకపోయేది. ఒకవైపు రాజకీయాలు మరోవైపు టీవీ షో ల వల్ల ఆమె చాలా బిజీ అయిపోయేది. అలాంటి బిజీ లైఫ్ గడుపుతోండగా ఒకసారిగా కరోనా రావడం ఆమె అన్ని వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో రోజా తన పిల్లలకు తన చేతివంట రుచి చూపించింది. వారిని ప్రేమగా చూసుకునే అదృష్టం కూడా తనకు లభించిందని రోజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలానే సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ ఉంటుందో అన్ని ఇబ్బందులు వస్తుంటాయని రోజా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తమపై పుకార్లు రాయడం అసభ్యంగా కామెంట్లు చేయడం గురించి ఆమె ప్రస్తావించింది. ఈ టోలర్స్ బారిన తన కూతురు అన్షుమాలిక కూడా పడిందని చెబుతూ ఆమె ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది.
కొందరు గుర్తు తెలియని వారు తమ అమ్మాయి ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేసే వారని.. దీనివల్ల తన పాప ఎంతో సఫర్ అయిందని రోజా వెల్లడించింది. తను చాలా సెన్సిటివ్ అని.. అందుకే ఈ విషయాన్ని పెద్దది చేసుకోలేదని రోజా చెప్పుకొచ్చింది. గతంలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ వంటివి చూసిన తర్వాత తన అమ్మాయి ఎంతగానో బాధ పడిందని.. చివరికి ‘ఇదంతా మనకు అవసరమా, అమ్మా?’ అని కూడా తనను మొహం పట్టుకొని అడిగినట్లు రోజా చెప్పింది. ఇలాంటి విషయాలను ఎలా పట్టించుకోకూడదో తాను తన పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని అని కూడా పేర్కొంది.