ఇండస్ట్రీలో మరో వెడ్డింగ్ బెల్స్..పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ తర్వాత కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చూసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంతకాలంగా రకుల్ సౌత్ సినిమాలు చేయకుండా బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది.

వరుస బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని రకుల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే రకుల్ వయసు మూడు పదులు దాటడంతో ఆమె పెళ్లి గురించి కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అయితే ఇదే క్రమంలో రకుల్ ఓ బాలీవుడ్ బడా నిర్మాతను లవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఇద్దరు డేటింగ్ లో కూడా ఉన్నారంటు వార్తలు వస్తున్నాయి. ఆ బాలీవుడ్ నిర్మాత ఎవరంటే జాకీ బగ్నాని తోనే రకుల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది.

Rakul Preet Singh Wedding News: Rakul Preet Singh reacts to wedding rumours  with beau Jackky Bhagnani; says ' sab bakwas' | - Times of India

రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ గురించి బహిరంగంగా ప్రకటించింది. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తో చట్ట పట్టాలేసుకుని తిరుగుతుంది. గత కొన్ని రోజుల క్రితమే రకుల్ పుట్టినరోజున‌ కూడా జాకీ బగ్నానితో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే క్రిస్మస్ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఆ ఫోటోలు కింద ఈ క్రిస్మస్ కి శాంటా క్లాస్ నాకు జాకీ ని గిఫ్ట్ గా ఇచ్చారంటూ’ ఆ పోస్ట్‌ కింద రాసుకొచ్చింది. కాగా వచ్చే కొత్త సంవత్సరంలో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.