తండ్రి-కూతుర్లను విడతీసింది..కళ్యాణ్ దేవ్ సెన్సేషనల్ పోస్ట్..!!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా పెళ్లి విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇప్పటికే శ్రీజా రెండు పెళ్లిళ్లు చేసుకోగా..రెండో భర్త కళ్యాణ్ దేవ్‌తో కూడా శ్రీజా విడిపోయిన‌ట్లు తెలుస్తుంది. రెండో పెళ్లికి ముందే శ్రీజాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కళ్యాణ్ దేవ్‌తో పెళ్లి తర్వాత వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ప్రస్తుతం ఆ పాపకి నాలుగు సంవత్సరాల వయసు.

Chiranjeevi's Daughter Sreeja Konidela Sparks Rumors Of Separation From  Husband Kalyaan Dhev - Here's Why

అయితే శ్రీజా- కళ్యాణ్‌ విడిపోయారన్నది వాస్తవం అయితే వారి పాప విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా కళ్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు వారి మధ్య జరిగే గొడవలకు అనుగుణంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. అయితే ప్రస్తుతం వీరి కూతురు ‘నవిష్క’ శ్రీజా దగ్గర ఉండటంతో.. కళ్యాణ్ దేవ్ ఎప్పుడు పెడితే అప్పుడు కూతురు దగ్గరకు వెళ్ళడానికి వీలు కుదరడం లేదట.

రీసెంట్‌గా జరిగిన క్రిస్మస్ రోజున తన కూతురు పుట్టిన రోజు కావడంతో కళ్యాణ్ తన కూతురు దగ్గరకు వెళ్లి తనతో కొంత సమయం గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌ కింద ”తల్లి నిన్ను బాగా మిస్ అవుతున్నాను” అంటూ త‌న బాధను ఆ పోస్ట్‌లో పంచుకున్నాడు. తన వద్దే నవిష్క ఆనందంగా ఉంటుంది, అని అర్థం వచ్చేలా కళ్యాణ్ దేవ్ గతంలో పోస్ట్స్ పెట్టాడు. తనతో నవిష్క హ్యాపీగా ఆడుకుంటున్న ఫోటోలు షేర్ చేశాడు. ఈ పరిణామాలు గమనిస్తుంటే కూతురు ఎవరి వద్ద ఉండాలనే విషయంలో శ్రీజా-కళ్యాణ్ దేవ్ మధ్య గొడవలు నడుస్తున్నాయని తెలుస్తుంది.