ఓ మై గాడ్: దాని కోసం ప్రభాస్ అన్ని కోట్లు అప్పు చేసాడా..?

మన దేశంలోనే ఎందరో వ్యాపార వేత్తలు తమ బిజినెస్ పేరిట బ్యాంకుల దగ్గర నుంచి కోట్ల డబ్బులను లోన్ గా తీసుకోవడం ఆ డబ్బులను తిరిగి చెల్లించడం సహజంగా మారిపోయింది. మరికొందరు ఆ డబ్బులు చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఓ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు అంటే మీరు నమ్ముతారా. అది కూడా కేవలం రూ.21 కోట్ల అంటే నమ్మేలా లేదు కదూ.. కానీ ఆ స్టార్ హీరో నిజంగానే ఓ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఆ స్టార్ హీరో మరి ఎవరో కాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ తాను చేసే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన చేతులో ప్రాజెక్టుకే, సలార్ వంటి బడా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. అటువంటి ప్రభాస్ కేవలం రూ.21 కోట్ల కోసం లోన్ తీసుకున్నాడు అంటే ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

Engaging with unregistered nano-lending fintech firms is highly risky, SECP

అయితే ప్రభాస్‌కు హైదరాబాద్‌లో ఎన్నో ఆస్తులు, ల్యాండ్‌లు ఉన్నాయి. వాటిలో ఒక ల్యాండ్ ని తాకట్టు పెట్టి మరి ప్రభాస్ రూ.21 కోట్ల లోన్ తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలు విని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన మార్కెట్ దృష్ట్యా ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ వీటితోపాటు ఏ కమర్షియల్ యాడ్ లో నటించిన రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

అలాంటిది కేవలం రూ.21 కోట్ల కోసం ప్రభాస్ ల్యాండ్ తాకట్టు పెట్టడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. ఆయన లోన్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఆ ల్యాండ్ ఎప్పటి నుంచో ఖాళీగా ఉండటంతో ఆ ల్యాండ్‌ను తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ఆ ల్యాండ్ లో ఓ బిజినెస్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాన్ని కోసమే ఆ ల్యాండ్ మీద లోన్ తీసుకున్నాడు అన్నమాట. ప్రభాస్ లోన్ తీసుకున్న మేటర్ సోషల్ మీడియాలో వైరల్ల్ గా మారింది.