అన్ స్టాపబుల్ 2: పవన్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. షో లో మరో గెస్ట్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా బాలకృష్ణ ఎవరు ఊహించిన రీతిలో అదరగొడుతున్నాడు. మొదటి సీజన్ ను మించి రెండో సీజన్‌లో వచ్చే గెస్ట్ లతో బాలయ్య చేసే రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పొలిటికల్ లీడర్స్ తో కూడా బాలయ్య చేస్తున్న ఇంటర్వ్యూస్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే ఈ సీజన్‌లో ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ అవ్వగా.. ఏడో ఎపిసోడ్ కూడా న్యూ ఇయర్ కనుక బాలయ్య బాహుబలి ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఎపిసోడ్‌లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మ్యాచో  స్టార్ గోపీచంద్ గెస్ట్ లుగా వచ్చారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఈ షో కి సంబంధించిన ప్రోమోస్ కూడా విడుదల అవ్య‌గా ఈ బాహుబలి ఎపిసోడ్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది.

Balayya and Pawan Kalyan shooting for Unstoppable 2

ఇప్పుడు మరో క్రేజీ ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఆ ఎపిసోడ్‌లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాలయ్య షోకి అతిథులుగా రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తాను నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చి మరి ఈ షో కి వచ్చారు. అయితే ఈ షోలో ఎవరు ఊహించని ట్విస్టులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షోలో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్‌మే కాకుండా మరో స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ షోలో సింగిల్ గెస్ట్ వచ్చిన మధ్యలో మరో స్పెషల్ గెస్ట్ వచ్చి అందరినీ మెస్మరైజ్ చేయటం కూడా మనం పలు ఎపిసోడ్‌లో చూసాం. ప్రస్తుతం ఈరోజు షూటింగ్ జరిగే పవర్ స్టార్ ఎపిసోడ్ మధ్యలో ఫోన్ కాల్ ద్వారా సాయిధరమ్ తేజ్ కూడా కొద్దిసేపు ఈ షోలో జాయిన్ అవుతారట. దీంతో ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకుండానే పవన్- బాలయ్య ఎపిసోడ్ పై అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి.
ఈ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారు..? బాలయ్య- పవన్ ను ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు..? ప్రస్తుత రాజకీయాల గురించి పవన్-బాలయ్య ఏ విధంగా స్పందిస్తారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ ఇద్దరూ కలిస్తే అన్‌స్టాపబుల్ మరో రేంజ్ కి వెళుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.