పెళ్లయిన తర్వాత నయనతార కెరీర్‌లో అన్నీ ఎదురు దెబ్బలే.. అతడు లక్కీ కాదా?

ప్రముఖ నటి నయనతార తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని గెలుచుకుంది. ఇండియాలో స్టార్‌డమ్ సంపాదించుకున్న అతి తక్కువ హీరోయిన్స్‌లో నయనతార కూడా ఒకరు. ఒకప్పటి నటి విజయశాంతికి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు నయనతారకి ఉంది. ఇక తెలుగు, తమిళ్ ప్రేక్షకులైతే కేవలం నయనతార ఉందనే కారణంతో సినిమా చూడటానికి థియేటర్స్‌కి వెళ్తూ ఉంటారు. ఇంత ఫాలోయింగ్ చూసిన తరువాత నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

అయితే ఆమె నటించిన కొన్ని లేడీ ఒరియాంటెడ్ సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఈ మధ్య ఎందుకో నయనతార ఫార్ములా వర్కౌట్ కావడం లేదు. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా యావలో పడి హీరోల సరసన నటించడం తగ్గించేసింది. దాంతో స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్‌లు ఆమెను వెత్తుక్కుంటూ రావడం లేదు. అది ఆమె కెరీర్‌కి మైనస్ పాయింట్ అవుతుంది. గత రెండేళ్లుగా నయనతార నటించిన సినిమాలకి మంచి టాక్ వచ్చిన కూడా థియేటర్స్‌లో మాత్రం ప్లాప్ అవుతున్నాయి.

గత ఏడాది నయనతార నటించిన ‘నేత్రికన్’ లేడీ ఓరియంటెడ్ సినిమా ఓటీటీలో రిలీజై పరాజయం పాలయింది. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఆమెకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ ఏడాది విజయ్ సేతుపతి, సమంతాలతో కలిసి ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా చేయగా అది నయనతారకు ప్లాప్ అందించింది.

చాలా రోజులు గ్యాప్ తరువాత నయనతార, మెగాస్టార్ చిరంజీవి సరసన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక డిసెంబర్ నెలలో నయనతార ఎన్నో షాకులు రుచి చూసింది. ఈ నెల ఆరంభంలో ఆమె నటించిన మలయాళ చిత్రం గోల్డ్ రిలీజ్ అయ్యి ప్లాప్ అయింది. ఇక ఇటీవలే విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన హర్రర్ మూవీ ‘కనెక్ట్ ‘లో నయనతార నటించింది. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ్ భాషలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇలా వరుస ప్లాప్స్ వస్తుండగా అభిమానులు తీవ్ర నిరాశపడుతున్నారు ఆమెకు ఎన్నడూ లేని విధంగా ఇలా ఫ్లాప్స్ రావడానికి కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ‘పెళ్లయిన తర్వాతే నయనతార కెరీర్‌కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. బహుశా ఆమె భర్త తనకు అంత లక్కీ కాదేమో’ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా నయనతార అభిమానుల కోసమైనా ఒక హిట్ తప్పనిసరిగా కొట్టాల్సిందే.