యాంకర్ సుమ అభిమానులకు చేదు వార్త… యాంకరింగ్ కి గుడ్ బై?

యాంకర్ సుమ గురించి చెప్పడానికి ఒక సందర్భం సరిపోదు. వెండితెరకు మెగాస్టార్ ఎలాగో బుల్లితెరకు సుమ అలాగన్న మాట. తెలుగు బుల్లితెరపైన యాంకర్ గా ఆమె ప్రస్థానం దాదాపు రెండు దశాబ్దాలనాటిది అని చెప్పుకోవచ్చు. తన మాటల చతురతతో దశాబ్దాల పాటు యాంకరింగ్ లో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న సుమ అంటే తెలుగు ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. షో ఏదైనా సుమ యాంకర్ అయితే TRP పరుగులు పెట్టాల్సిందే. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి లెజెండరీ షోలకు కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది.

ఎంతలాగ అంటే ప్రముఖులందరూ ఆమెనే యాంకర్ గా పెట్టుకునేంత. ఆమె తరవాతనే సెకండ్ ఆప్షన్ ఇంకెవరికైనా వెళ్తుంది. పట్టుకుంటే పట్టుచీర, భలే ఛాన్స్ లే, మహిళలు మహారాణులు వంటి లేడీస్ షోలు ఏళ్ల తరబడి కొనసాగిన సంగతి అందరికీ తెలిసినదే. నేడు యంగ్ జనరేషన్ వచ్చినా కూడా సుమకు తిరుగులేకుండా వుంది. స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ నుండి నంది అవార్డ్స్ వంటి భారీ వేదికలకు కూడా సుమనే అందరి ఛాయిస్. అలాంటి సుమ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పనున్నారన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో షాకింగ్ గా మారింది.

అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న సుమ ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం. కాగా సుమ యాంకరింగ్ మానేస్తున్నారంటూ కథనాలు వచ్చిన తరుణంలో అవన్నీ పుకార్లు అని తెలిసిపోయింది. ఆమె స్వయంగా మాట్లాడుతూ…. “ఒక మలయాళీ అమ్మాయిని అయిన నేను ఇక్కడ సెటిల్ కావడం నిజంగా అదృష్టం. దానికి తెలుగు ప్రేక్షకులకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంత కాలం యాంకరింగ్ కి విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. అయితే పూర్తిగా యాంకరింగ్ కి దూరం కాను, అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.”