హరిహర వీరమల్ల నుంచి లీకైన పవన్ కళ్యాణ్ ఫొటోస్..!!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుపుకుంటుంది. గ్యాప్ లేకుండా లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఇందులో అంతే నిబద్దతతో షూటింగ్లో పాల్గొనబోతున్నారు. త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి రాజకీయాల వైపు వెళ్లడానికి.. ఆయన ఈ సినిమా షూటింగ్లో వరుసగా పాల్గొంటూ ఉండడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పవన్ లుక్ లీక్ అవ్వడం జరిగింది. హరిహర వీరమల్లు చిత్రంలో ఆయన నయా గెటప్ తో కూడిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక లేడీ టెక్నీషియన్.. షూటింగ్ సెట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగగా.. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాతో ఆమె పంచుకోవడంతో అవి బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు లుక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఫోటోలో గడ్డంతో పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. నుదుట పై గాయం కూడా కనిపిస్తోంది.

రెడ్ డ్రెస్ వేసుకుని.. యుద్ధంలో పాల్గొనే యోధుడిలా ముస్తాబయ్యాడు. హరిహర వీరమల్లు చిత్రంలోని పవన్ గెటప్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఈయన గెటప్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోందని చెప్పవచ్చు. గతంలో విడుదల చేసిన హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ లో కనిపించాడు పవన్. అయితే ఇలాంటి గెటప్ లో అప్పుడు కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం అంతకుమించి అనేలా ఈ గెటప్ కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ గెటప్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు అని తెలియడంతో అభిమానులను పూనకాలు వచ్చేస్తున్నాయి.