తాజాగా యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న కార్యక్రమం క్యాష్.. ప్రతివారం ఈ షో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది.. సుమ చలాకీగా ఉంటూ సందర్భాను సారంగా వేసే కామెడీ పంచ్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ షో కి హాజరైన అతిథులను కూడా సుమా ఉత్సాహపరుస్తూ మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. తాజాగా క్యాష్ షోకి సీనియర్ కమెడియన్ లైన పృథ్వీరాజ్.. నటి జ్యోతి, కృష్ణ భగవాన్, కరాటే కళ్యాణి అతిథులుగా హాజరయ్యారు. వీరంతా కలిసి ఒక రేంజ్ లో కామెడీతో హంగామా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా క్యాష్ ప్రోమో విడుదలై ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే కృష్ణ భగవాన్ కూడా తను సెటైర్స్ తో బాగా నవ్వించాడు..
అయితే ఆ సెటైర్లకి కమెడియన్ పృథ్వి బలైపోయారని చెప్పాలి. అయితే క్యాష్ షోలో ఆడియో ఫంక్షన్ అని ఒక సరదా స్కిట్ వేయగా స్కిట్ లో.. దర్శకుడు గా కృష్ణ భగవాన్, హీరో కమెడియన్ గా పృద్వి, నిర్మాతగా కరాటే కళ్యాణి , ఆడియో వేడుకకు యాంకర్ గా జ్యోతి వ్యవహరించారు. ఇందులో భాగంగా కృష్ణ భగవాన్, కరాటే కళ్యాణి ఒక రేంజ్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు. ముఖ్యంగా వారి డబుల్ మీనింగ్ డైలాగులకు సుమ నోటి వెంట మాట కూడా రాలేదు.. కృష్ణ భగవాన్ మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్ళాము.. అక్కడ హీరో పృద్వి చలికి తట్టుకోలేకపోయాడు. అందుకే తోడుగా ఇద్దరు హీరోయిన్లని ఇచ్చాము. అయినా కూడా చలి తట్టుకోలేకపోయాడు అంటూ నవ్వులు పూయించారు.
నిర్మాతగా వ్యవహరించిన కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం నేను అంతా సమర్పించేసుకున్నాను.. నా జీవితం నాశనం అయ్యింది.. పృథ్వీ ని చూపిస్తూ.. అమ్మ దీనమ్మ బత్తాయో.. ఈ బత్తాయి మాత్రం పిండేసాడు బాగా.. అని చెప్పడంతో సుమా వెంట నోటి మాట రాలేదు. ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతో వీరు రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.