అజయ్ భూపతి తెరకెక్కించిన `ఆర్ఎక్స్ 100` సినిమాతో పాపులర్ అయిన అందాల భామ పాయల్ రాజ్ పుత్.. ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి ఇలా వరుసగా సినిమాలు చేస్తోంది.
కానీ సరైన హిట్ మాత్రం పడడం లేదు. వీలు చిక్కినప్పుడల్లా వెబ్ సిరీస్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఈ పంజాబీ భామ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోషూట్లతో అభిమానులను మరియు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మితిమీరిన గ్లామర్ షో చేస్తూ కాక రేపుతూ ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు ఏకంగా బాత్ టవల్ లో టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయిజ.
ఈ పిక్స్ చూసి.. `ఇది బయలుదేరింపు కాదు అంతకుమించి` అంటూ పాయల్ ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పాయలు తాజా ఫోటోలు మాత్రం నెట్టింట తెగ దుమారం రేపుతున్నాయి.