“మొగుడు చచ్చి భార్య ఏడుస్తూ ఉంటే .. ఎవ్వరో వచ్చి ఇంకేదో అడిగిందన్న” సామెత లాగా తయారయింది ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ పొజిషన్. ఎస్ ప్రజెంట్ ఇదే విధంగా ట్రోలర్స్ నందమూరి ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే అన్ స్టాపబుల్ లో ప్రభాస్ – బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నింది.. అన్ స్టాపబుల్ 2 లో బాలయ్య- ప్రభాస్ కేక.. ఇవన్నీ వింటున్న నందమూరి ఫ్యాన్స్ కు ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోపక్క ఎక్కడో మండిపోతున్న ఫీలింగ్ ఉండనే ఉంది .
ఆ విషయాన్ని అఫీషియల్ గా ఒప్పుకోవట్లేదు అంతే అంటూ కొందరు జనాలు కావాలని నందమూరి ఫ్యాన్స్ ని కెలుకుతున్నారు. నిజానికి అన్ని పక్కాగా ఉంటే సీజన్ వన్ కి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ఎంతో ఆశలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్ . కానీ కొన్ని కారణాల చేత ఆ సీజన్ కి తారక్ రాలేదు . కనీసం సీజన్ 2 కైనా వస్తాడని బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే ఎవరిని ఎవరినో షోకి పిలుస్తున్నారు కానీ తారక్ ని మాత్రం షోకి పిలవట్లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఆహా ఆహ్వానం తారక్ కి అందలేదు . ఈ క్రమంలోనేజూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆహా పై గుర్రుగా ఉన్నారు.
నందమూరి బాలయ్య అంటే ఇష్టం ఉన్నా సరే .. ఎక్కడో ఓ మూల తారక్ ని అన్ స్టాపబుల్ కి పిలవలేదు అన్న ఫీలింగ్ లోలోపల ఉంది . ఈ క్రమంలోనే అసలు విషయాన్ని చెప్పలేక బాలయ్య – ప్రభాస్ ఎపిసోడ్ పై రెబల్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తుంటే..అది భరించలేక అసలు విషయం చెప్పలేక మింగలేని కక్కలేని పొజిషన్లో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్ అంటూ కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారు .
చూడాలి మరి నందమూరి ఫ్యాన్స్ బాధలు విన్న ఆహా ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా పిలుస్తుందో..? అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ సీజన్ 2 కి లాస్ట్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ ది అంటూ తెలుస్తుంది . ఒకవేళ అదే నిజమైతే తారక్ ఫ్యాన్స్ కోపానికి బలైపోవాల్సిదే ఆహా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!