ఆ సౌత్ హీరోకు ఫోన్ చేసి మ‌రీ ఆఫ‌ర్ అడిగిన జాన్వీ.. ఇంత‌కీ అత‌నెవ‌రంటే?

దివంగ‌త న‌టి, అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తోంది. కానీ సరైన బ్రేక్‌ మాత్రం రావ‌డం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు సౌత్లోకి అడుగు పెట్టాలని తహతహలాడుతుంది. వీలు చెక్కినప్పుడల్లా తన మాటలతో సౌత్ స్టార్ హీరోలను అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేస్తుంది.

ఇటీవల ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ పేర్కొన్న జాన్వీ కపూర్.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. సౌత్ కు చెందిన ఓ స్టార్ కు హీరోకి ఫోన్ స్వ‌యంగా జాన్వీ ఆఫ‌ర్ అడిగేసింది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు విజయ్ సేతుపతి. ఈయ‌న‌ అంటే జాన్వీ కపూర్ కు ఎంతో ఇష్టమట. విజ‌య్ కుకు పెద్ద అభిమాని అట.

విజయ్ సేతుపతి నటించిన `నానుమ్ రౌడీ` చిత్రాన్ని జాన్వీ ఏకంగా 100 సార్లు చూసిందట. అంతేకాదు విజయ్ నెంబర్ తెలుసుకుని ఆయనకు ఫోన్ చేసిందట. `నేను మీకు పెద్ద అభిమాని. మీరు చేసే నెక్స్ట్ సినిమాలో నటించాలని ఉంది. ఆఫర్ ఇవ్వండి. ఆడిషన్ కోసం ఎదురు చూస్తుంటా` అని జాన్వి ఓపెన్ గానే చెప్పేసిందట. జానీ మాటలకు విజయ్ అయ్యో.. అయ్యో.. అంటూనే ఏం మాట్లాడకుండా ఉండిపోయారట. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. మరి విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం జాన్వీకి వస్తుందా లేదా అన్నది చూడాలి.