గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. కన్నడ డైరెక్టర్ కం హీరో రిషిబ్ శెట్టి పేర్లు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో రష్మిక ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తున్న టైంలో రిషిబ్ శెట్టికి ఆమెకు మధ్య ఏవో కొన్ని వివాదాలు వచ్చాయని..వాటిని అలాగే క్యారీ చేస్తూ కాంతారా సినిమా హిట్ అయిన టైంలో రష్మిక వాటిపై రీవేంజ్ తీర్చుకోవడంతో రిషెబ్ శెట్టికి కాలింది.
ఈ క్రమంలోనే ఆమెతో సినిమా చేసేదే లేదు అంటూ పరోక్షంగా స్పందించాడు . దీంతో ఇద్దరి మధ్య వార్ హిట్ పెరిగిపోయింది . ఈ క్రమంలోనే రష్మిక -రిషిబ్ శెట్టి వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఎవరూ ఊహించిన విధంగా వీళ్ళిద్దరి గొడవలోకి తలదూర్చాడు మెగా హీరో . ఆయన ఎవరో కాదు..పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ .
మనకు తెలిసిందే రష్మిక మందన్నా అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమా పుష్ప . గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా టాక్ సంపాదించుకుంది . అంతేకాదు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది . ఈ సినిమా చేసిన తర్వాతే రష్మిక మందన పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. కాగా రీసెంట్ గా ఈ సినిమాను రష్యాలో రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు పుష్ప టీం. ప్రమోషన్స్ లో భాగంగా చిత్రం బృందం రష్యా చేరుకుంది . అక్కడే అల్లు అర్జున్ ..రష్మిక -రిషిబ్ శెట్టి మధ్య జరుగుతున్న వార్ గురించి అడిగి క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తుంది .
అంతేకాదు ఈ విషయంలో రష్మికదే తప్పు అంటూ క్లారిటీ ఇచ్చెసాడట. మనం మనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ని ఆ విధంగా మాట్లాడడం తప్పు అంటూ ఇండస్ట్రీలో హీరోయిన్గా నెట్టుకు రావాలి అంటే కచ్చితంగా ఆచితూచి మాట్లాడాలి..అని ఉన్నది ఉన్నట్లు క్లారిటీగా చెప్పుకొచ్చారట. దీంతో రష్మిక ఆయనకి సారీ చెప్పడానికి సైతం సిద్ధపడినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మరోసారి తన నిజాయితీని ప్రూవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్ అంటూ అల్లు ఫాన్స్ సంబర పడుతున్నారు . నిజంగా రష్మిక ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేసుకుంటే..ఆమె కెరియర్ మరింత హై రేంజ్ లో దూసుకుపోతుంది అన్నది మాత్రం వాస్తవం..!!