చిరంజీవి – బాలకృష్ణ వార్‌… ఫ‌స్ట్ టైం ఈ పందెంలో విన్న‌ర్ ఎవ‌రో ?

టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలు బాల‌కృష్ణ‌- చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో కొన‌స‌గుతున్నారు. వీరి సినిమాలు కూడా ఎన్నో సార్లు పోటి ప‌డ్డాయి. ఆ పోట్టిలో ఒకసారి బాల‌కృష్ణ విజ‌యం సాధిస్తే… మ‌రోసారి చిరంజీవి విజ‌యం సాధించారు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య సంక్రాంతి పోటి అంటే టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉంది, ఇక ఇప్ప‌డు ఇద్ద‌రు హీరోలు వ‌చ్చే సంక్రాంతికి పోటి ప‌డ‌బోతున్నారు.

బాల‌కృష్ణ అఖండ సినిమా లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తున సినిమా వీర సింహారెడ్డి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. చిరు కూడా గాడ్ పాధ‌ర్ లాంటి హిట్ త‌ర్వాత న‌టిస్తున సినిమా వాల్తేరు వీరయ్య సినిమా కూడా వ‌చ్చే సంక్రాంతికి జ‌న‌వ‌రి13న రాబోతుంది. ఈ రెండు సినిమాల‌ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా వారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి.

టాలీవుడ్ విశ్వసనీయ వ‌ర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ వారు ఏకంగా రూ.100 కోట్ల కు పైగా భారీ బడ్జెట్ తో రూపుందిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి సినిమా కు ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. వీర సింహారెడ్డి సినిమా కోసం 120 నుండి 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వ‌చ్చే సంక్రాంతికి ఇద్ద‌రు హిరోలు రూ. 100 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలతో పోటీ పడుతుండడం చాలా ప్రత్యేకమైన విషయం.

సంక్రాంతి రేస్.. ఇంకా తేలని థియేటర్స్ ఇష్యు.. చివరికి విన్నర్ ఎవరో | Waltair  Veerayya and Veera Simha Reddy, Veera Simha Reddy, Waltair Veerayya,  Megastar Chiranjeevi, Balakrishna ,Varasudu, Dil ...

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందడం వల్ల రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వ‌స్తేనే నిర్మాతలకు లాభాలు దక్కినట్లు. కనుక ఈ రెండు సినిమాలు కూడా రూ.100 కోట్లుకు పైగా క‌ల‌క్ష‌న్లు రాబడుతాయా ? ఈ పందెంలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు ?అనేది ఆసక్తికరంగా మారింది.