`వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ స్క్రీన్ టైమ్ ఎంతో తెలిస్తే పూన‌కాలు ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో అందాల భామ శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక‌పోతే ఇందులో ఏసీపీ విక్రమ్‌సాగర్‌ పాత్రలో ర‌వితేజ కనిపిస్తుండగా… ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ ఇప్పటికే నెట్టింట్లో హల్‌ చల్ చేసింది. అయితే ఈ సినిమాలో ర‌వితేజ స్క్రీన్ టైమ్ కు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ చిత్రంలో ర‌వితేజ గెస్ట్ రోల్ చేస్తున్నాడ‌ని మొద‌ట అంద‌రూ భావించారు. కానీ, `వాల్తేరు వీర‌య్య‌` సినిమా రన్ టైం మొతం 2 గంటల 35 నిమిషాలు ఉంటే.. అందులో 45 నిమిషాలు రవితేజనే ఉంటాడ‌ని అంటున్నారు. ఆ 45 నిమిషాలు ర‌వితేజ పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మ‌రియు సినిమాకు సైతం అత‌డి పాత్ర‌ హైలెట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే ర‌వితేజ ఫ్యాన్స్‌కు పూన‌కాలు ఖాయం.