ఎట్ట‌కేల‌కు పెళ్లికి యాంక‌ర్ ప్ర‌దీప్ గ్రీన్ సిగ్న‌ల్‌.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా తనదైన వాక్చాతుర్యం, కామెడీ టైమింగ్ తో ఎన్నో టీవీ షో లను సూపర్ హిట్ చేశాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. గ‌త‌ ఏడాది `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇదిలా ఉండగా గ‌త‌ కొంతకాలం నుంచి ప్ర‌దీప్ పెళ్లి మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మొన్నాద్య పొలిటికల్ లీడర్ కూతురుతో ప్రదీప్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు చివరకు పుకార్లుగానే మిగిలాయి. ఇక ఎన్నిసార్లు పెళ్లి గురించి అడిగినా ప్రదీప్ మాట దాటేస్తూనే వచ్చాడు.

అయితే ఎట్టకేలకు ప్రదీప్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంతకీ ప్రదీప్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరో కాదు ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును అని తెలుస్తోంది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా ప్రేమ‌లో ఉన్నారని, ఇక వీరు త‌మ బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పెళ్లి రెడీ అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఆరంభంలో వీరి వివాహం జ‌ర‌గ‌బోతుంద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, న‌వ్య బుల్లితెర మరియు సోషల్ మీడియా సెలబ్రెటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.