ప్రభాస్ సినిమా నుండి నిధి అగర్వాల్ ఆకారణంగానే తప్పుకుందా?

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్లకు లేని క్రేజ్ కూడా ప్రభాస్ సొంతం అయింది అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ దిగంతాలకు చేరింది. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ డార్లింగ్ వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా వున్నాడు. అలా తానూ ఒప్పుకున్న వరుస సినిమాల్లో దర్శకుడు మారుతి మూవీ కూడా ఒకటి.

ఇక ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినా.. సైలెంట్ గా పూజా కార్యక్రమాలు జరిగిపోయిన విషయం అందరికీ తెలిసినదే. అంతేకాకుండా 2 వారాల షూటింగ్ కూడా జరిగింది. DVV దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారంటూ ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పుడు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడం కొసమెరుపు. ఇక ఈ మూవీలో కొంచెం హర్రర్ టచ్ ఉంటుందని ఆమధ్య ఓ మీడియా వేదికగా దర్శకుడు చెప్పినట్టు గుర్తుందికదా. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుంది అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది.

ఈ సినిమా కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో స్కోప్ ఉందట. ఈ క్రమంలోనే ఇందులో ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ‘రాధే శ్యామ్’ బ్యూటీ రిద్ధి కుమార్ నటిస్తారంటూ కథనాలు కోకొల్లలుగా వినిపించాయి. ఇక ఈ ముగ్గురు ఫిక్స్ అని కూడా ఆమధ్య చిత్ర బృందం తెలిపింది. కానీ ఇప్పుడు నిధి అగర్వాల్ తప్పుకోబోతుంది అని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం నిధికి లుక్ టెస్ట్ చేయగా.. మ్యాచ్ అవ్వలేదు అని భోగట్టా. దీంతో మారుతి.. నిధిని లైట్ తీసుకున్నాడట!