విజయ్ దేవరకొండ ధరించిన వాచ్ ఖరీదుతో ఒక ఇల్లే కట్టొచ్చు తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ లో అతనికి ఉన్న క్రేజ్ న భూతొ న భవిష్యతి. మొదటి సినిమా ‘పెళ్ళి చూపులు’ మొదలుకొని ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ పేరు టాలీవుడ్లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఎంతలా అంటే? సో కాల్డ్ బడా హీరోలు సైతం కుళ్ళుకోనే స్టార్ డం సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ సినిమాలు డిజాస్టర్ అయినా ఇతని క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు.

అయితే ప్రస్తుతం విజయ్ కి కాస్త బాడ్ టైం స్టార్ట్ అయింది. హీరోయిన్ సమంత ఆరోగ్యం కాస్త క్షిణించడంతో ‘ఖుషి’ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది. డిసెంబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ముందుగా ప్రకటించారు కానీ.. ఇప్పుడు అది మరోసారి వాయిదా పడటం దురదృష్టకరం. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అసలు విషయానికొస్తే విజయ్ దేవరకొండ యూత్ లో క్రేజ్ ను సంపాదించుకోవడానికి మరో కారణం అతని డ్రెస్సింగ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు.

అవును, అతను ధరించే డ్రెస్సులు నుండి షూస్, వాచెస్, బెల్ట్, జాకెట్ ఇలా అన్నీ స్టైలిష్ గా ఉంటాయి. ఇక అతని ఫోటో షూట్లు చూస్తే యూత్ కి మతి పోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా లేడీ ఫాన్స్ పిచ్చెక్కిపోవాలంతే. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా అందులో విజయ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇది ఓ కార్టియర్ వాచ్. ఈ సాంటోష్ డి కార్టియర్ వాచ్ ఏకంగా రూ.30,42,935.07 లక్షలు. ఈ వాచ్ ధర తెలిసాక నెటిజన్లు ఆ ఖరీదుతో ఏకంగా ఓ ఇల్లే కట్టొచ్చు అని అంటున్నారు.