ఈ సంవత్సరం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ2 పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరూ 18 పేజెస్ అనే సినిమాతో ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది. ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ తో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా వచ్చారు. ఈ సినిమాకు సుకుమార్ స్వయంగా కథ అందించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నేలకున్నాయి .దానికి కారణం గతంలో కూడా సుకుమార్ కథ అందించి పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు కూడా 18 పేజెస్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. హీరోయిన్ అనుపమ పై పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇప్పుడు ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. సుకుమార్ మాట్లాడుతూ… రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించాల్సి ఉందని ఈ సందర్భంగా సుకుమార్ బయట పెట్టారు. అప్పుడు ఆడిషన్స్ నిర్వహించిన సమయంలో ఆమె మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండేదని అది చూసి తనకు భయం వేసింది అని సుకుమార్ చెప్పుకొచ్చాడు”.
అప్పటికి అనుపమ పరమేశ్వరన్ చిన్న పిల్ల అని అలా చూడడం సహజమే కానీ ఎందుకో తాను రిస్క్ చేయడానికి ప్రయత్నించలేదని అని అన్నారు. అయితే ఎప్పటికైనా మనం ఒక సినిమా చేద్దామని పేర్కొన్న సుకుమార్ నీకు తెలుగు రావడం గొప్ప విషయం అని నువ్వు చాలా గ్రేట్ టాలెంట్ ఉన్న అమ్మాయివి, చాలా అద్భుతమైన నటివి అన్ని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.