ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఒక్కొక్క ముద్దుగుమ్మ ఉన్న అందాలన్నీ ఆరబోస్తూ కుర్రాళ్ళు ను ఓ రేంజ్ లో టెంప్ట్ చేస్తుంది . అంతేకాదు మేకప్ లెస్ అని ..ఫిల్టర్ లెస్ అంటూ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు స్పెషల్ ట్రీట్ కూడా ఇస్తున్నారు. అయితే రీసెంట్గా స్టార్ డాటర్ శృతిహాసన్ పోస్ట్ చేసిన ఫొటోస్ మాత్రం జనాలకు భయంకరంగా అనిపిస్తుంది.
ఎప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళు టెంప్ట్ చేసే కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్ ..ఫస్ట్ టైం మేకప్ లేకుండా నాచురల్ లుక్స్ లో ..ఉన్నది ఉన్నట్లు ఫోటోను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . అంతేకాదు ఆ ఫొటోస్ అలా ఉండడం వెనక కారణం కూడా చెప్పుకొచ్చింది. శృతిహాసన్ కు ఫీవర్ గా ఉందట ..అంతేకాదు సైనస్ తో చాలా బాధపడుతుందట.. అంతేనా కరెక్ట్ గా ఆమె అదే టైం లో పీరియడ్స్ లో ఉన్నారట .
“చాలా బాడ్ పెయిన్ తో ఫీల్ అవుతున్నానని.. బ్యాడ్ డే..బ్యాడ్ హెయిర్ తో.. నా సెల్ఫీ ఇలా కూడా మీరు నన్ను ఆదరిస్తారని, ఎంకరేజ్ చేస్తారని, ఇష్టపడతారని తెలిసి ..ఈ ఫోటోని పోస్ట్ చేస్తున్నాను” అంటూ కామెంట్ జోడిచ్చింది. దీంతో శృతిహాసన్ ఫ్యాన్స్ నువ్వు ఎలా ఉన్నా బాగుంటావ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటు కామెంట్స్ చేస్తుంటే. కొందరు ఆకతాయిలు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. “మేకప్ లేకపోతే నువ్వు ఇంత దరిద్రంగా ఉంటావా..? ఒక్కసారిగా భయపడిపోయాం..” అంటూ ఆమె నేచురల్ లుక్స్ పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. శృతి మేకప్ లెస్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ప్రజెంట్ శృతిహాసన్.. బాలయ్య – చిరంజీవి సరసన సినిమాల్లో నటిస్తుంది.