టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోయిన్స్ తో ప్రభాస్ పైన పలు ఎఫైర్స్ బాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నటించిన హీరోలతో ఎఫైర్ నడిపారని వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించిన మొదటి పేరులో అనుష్క శెట్టి ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్, అనుష్క వివాహం కాయమే అంటూ ఎన్నోసార్లు కథనాలు కూడా వినిపించాయి. ఈ వార్తలను ప్రభాస, అనుష్క ఖండించడం కూడా జరిగింది.
అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి బాగా వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఆదిపురష్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. గడిచిన రెండు రోజుల క్రితం కృతిసనన్ ,ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా కేవలం పాపులారిటీ కోసమే చేసిందని అందరూ అనుకున్నారు కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ప్రభాస్ కృతి మధ్య చాలా సీరియస్ రిలేషన్ నడుస్తోందని సందేహాలు కలుగుతున్నాయి.
ఈ వార్తలపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వరుణ్ ధావన్ ,కృతి సనన్ బేడియా అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్, వరుణ్ ధావన్ పలు షో లలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆలా ఒక షోలో యాంకర్ గా కరణ్ జోహార్ ఉన్నారు. యాంకర్ ఇలా అడుగుతూ కృతి సనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్ అడగగా.. అందుకు వరుణ్ ధావన్ కృతి పేరు మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు.. మరొకచోట దీపికా పదుకొనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని వరుణ్ కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ దీపికా పదుకొనే ప్రాజెక్ట్ -k సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు దీంతో కృతి సనన్,ప్రభాస్ ఎఫైర్ నిజమేనని వార్తలు నమ్ముతున్నారు.