కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో సుధీర్ఘ కాలం నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్న అలీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అయితే ఈయన పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
అలీ సతీమణి జుబేదా కూతురు నిశ్చితార్థం దగ్గర నుంచి షూపింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా ప్రతి ఘట్టాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరితోనూ పంచుకుంది.
ఇక పెళ్లి వేడుక ఆదివారం నాడు హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. అలీ కుమార్తె వివాహానికి చిరంజీవి, నాగార్జున, అమల, రోజాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఫాతిమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. దీంతో నెటిజన్లు సైతం వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
B O S S #MegastarChiranjeevi garu today @#Ali Daughters Marriage 🤩#ValtheruVerayya #BossParty@KChiruTweets @Chiru2020_ @Deepu0124 @Chirufan4ever @ChiruIdealActor @Chiru_FC @ChiruFanClub @Chiru025527081 @EluruMegaFan @GaddamMega @Konidelachiru31 pic.twitter.com/KADKQeGnEQ
— Ramesh BOLLI (@RameshBOLLIS) November 27, 2022