గత కొద్ది రోజుల నుంచి సినీ తారలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ సైతం పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కియారా అద్వానీ. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడిపిస్తుందని గత కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరి కాంబోలో వచ్చిన `షేర్షా` సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్ధార్థ్ కియారాల మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అందుకు తోడు వీరిద్దరూ తరచూ చట్టపట్టలేసుకుని తిరగడం, కలిసి వెకేషన్లకు వెళ్లడంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమే అని చాలా మంది నమ్మారు. కియారా-సిద్ధార్థ్ లు సైతం తమ ప్రేమను పరోక్షంగా అంగీకరించారు. అయితే ఈ జంట ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారట.
ఇరుకుటుంబ సభ్యులు సైతం అంగీకరించడంతో వచ్చే నెలలోనే వీరి పెళ్లికి తేదీని ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పెళ్లి పనుల సైతం షురూ అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా కియారా పెట్టిన పోస్ట్ తో ఈ వార్తలు నిజమయ్యేలానే కనిపిస్తున్నాయి. సండే నాడు కియారా తన ఇన్స్టాగ్రామ్ లో వైట్ కలర్ డ్రెస్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఓ చిన్న వీడియోలు పోస్ట్ చేసింది. దీనికి `ఇక రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేను. డిసెంబర్ 2న అదేంటో వెల్లాడిస్తాను. అప్పటివరకు వేచి ఉండండి` అంటూ రాసుకొచ్చింది. దీంతో కియారా తన పెళ్లి పైనే అనౌన్స్మెంట్ ఇవ్వబోతుందని అభిమానులు మరియు నెటిజన్లు భావిస్తున్నారు.