కూతుర్లకు ఇంట్రెస్ట్ ఉన్నా హీరోయిన్స్ చేయని చంద్రమోహన్.. కారణం..?

సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన వారిలో వారసులకు కొదవే లేదు. ఎందరో నటి నటులు తమ వారసులను చిత్ర పరిశ్రమంలోకి పరిచయం చేశారు. అలా పరిశ్రమంలోకి వచ్చిన వారసులందరూ ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. ఐతే ఆ తరం హీరోల మధ్య ఎంతో గట్టి పోటీ ఉండేది. సినిమాలో కూడా అంతే పోటీపడి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించేవారు. అప్పటి సీనియర్ హీరోలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు. అయితే ఈ సీనియర్ హీరోలతో సమానంగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించన అలనాటి మరో హీరో ఉన్నాడు. అతను మ‌రి ఎవరో కాదు చంద్రమోహన్.

Actor Chandra Mohan puts an end to his acting career - TeluguBulletin.com
ఆరోజుల్లో ఈయనకు సినిమా పరిశ్రమంలో ఎంతో క్రేజీ ఉండేది. ఆయన నటన ఎంతో వైవిధ్యంగా ఉండేది. ఆనటనే ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.చాలా సినిమాల్లో హీరోగా నటించిన చంద్రమోహన్. ఎందరో హీరోయిన్లకు లైఫ్ కూడా ఇచ్చాడు. చంద్రమోహన్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైతే ఆ హీరోయిన్ కెరియర్ బాగుంటుందని ఒక రూమర్ కూడా బాగా వినిపించేది. అందాల నటి శ్రీదేవి కూడా తన మొదటి సినిమాను చంద్రమోహన్ తో కలిసి నటించింది. ప్రస్తుతం చంద్రమోహన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తు తండ్రి పాత్రలు చేసి మెప్పించారు.

ప్రస్తుతం వయసు మీద పడడంతో సినిమాలుకు దూరంగా ఉంటున్నారు. అయితే చంద్రమోహన్ తన తర్వాత సినిమా పరిశ్రమంలోకి తన కుటుంబం నుంచి ఎవరిని పరిచయం చేయలేదు. దీనికి కారణం కూడా ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పుకొచ్చాడు. చంద్రమోహన్ కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారు ఎంతో అందంగా ఉంటారు. ఆయన ఇద్దరు కూతుర్లు చిన్న కూతురు మాత్రం మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. వారికి సినిమా పరిశ్రమలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా.. చంద్రమోహన్ ఆయన కూతుర్లను సినీ పరిశ్రమలోకి రానివ్వలేదు. వస్తే వాళ్ల భవిష్యత్ పాడవుతుందని.. వెనకడుగు వేశారట.

అలనాటి సీనియర్ హీరోయిన్ అయినా భానుమతి మీ కూతుర్లు ఎంతో అందంగా ఉన్నారు హీరోయిన్‌ గా పరిచయం చేయండి అని అడగగా ఆయన ఆ విషయాన్ని సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చాడు. సినిమాల ప్రభావం తన కూతుర్లపై పడకుండా పెంచానని ఇద్ద‌రు చదువుల్లో ఎంతో గొప్పగా చదివి గోల్డ్ మెడల్లో కూడా సాధించారని తెలియజేశారు. అప్పుడు వాళ్ళని చూసి నాకు ఎంతో ఆనందం వేసింది. ప్రస్తుతం నా కూతుర్లు ఇద్దరూ వారి ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా ఉన్నారు అని చంద్రమోహన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.