ఆమె ఉంటే నేను సినిమాలో నటించను.. టైం చూసి కొట్టిన చరణ్ ..ఏం డేర్ రా బాబు..?

మెగా వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటనలో తండ్రి క్వాలిటీస్ ను అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా అడుగుపెట్టి ..మెగా అభిమానులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాడు. చిరుత సినిమాలో చరణ్ నటనకు.. మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటనకు వేరియేషన్స్ చూస్తే చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత ఇంప్రూవ్ అయ్యాడో ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చరణ్ చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు.

అంతేకాదు .. తన బాడీకి ఏ సినిమాలు సూట్ అవుతాయి ..తన సినిమాలో ఎవరు ఉంటే తనకి కలిసి వస్తుంది.. నటన పరంగా ఎవరు ఆ రోల్ కి న్యాయం చేయగలరు అన్న విషయం చరణ్ కి బాగా తెలుసు . ఈ క్రమంలోనే తన సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ ను తానే చూస్ చేసుకుంటాడు అన్న విషయం సోషల్ మీడియాలో ఎక్కువుగా వినిపిస్తుంది . కాగా గతంలో ద గోవిందుడు అందరివాడేలే సినిమా టైంలో ఆయన సినిమాలో మెగా ఫ్యామిలీ అంటే పడని ..మెగా ఫ్యామిలీలో హీరో పై నెగటివ్ కామెంట్స్ చేసే ఆవిడను సెలెక్ట్ చేసిన కారణంగా ఆ సినిమాలో ఆమె ఉంటే నేను నటించను అని ముఖం మీదనే చెప్పాడట .

గోవిందుడు అందరివాడేలే సినిమా చేస్తున్న టైంలో జయసుధ ఆరోగ్యం కొంచెం క్షీణించింది.. ఈ క్రమంలోనే ఆమె ప్లేస్ లో ఇండస్ట్రీలో ఉన్న మరో సీనియర్ బ్యూటీని పెట్టాలనుకున్నారు. అయితే ఆ బ్యూటీ ఎప్పుడు మెగా ఫ్యామిలీపై నోరు పారేసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోని చరణ్ ఆమెకు టైం చూసి దెబ్బ కొట్టాడు . ఆమె ఉంటే నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటాను అంటు డైరెక్ట్ గా డైరెక్టర్ కి చెప్పుకోవచ్చారు. దీంతో మెగా హీరో మాటలు అర్థం చేసుకున్న ఆ డైరెక్టర్ ..ఆమెను ఆ సినిమాలో నుంచి తీసేశాడు. ఏద్ది ఏమైనా సరే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న చరణ్ అంత పెద్ద ఆర్టిస్ట్ పై అలాంటి కామెంట్స్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.