చొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే బాలీవుడ్ చెక్కేసింది గాని, మొన్నటి వరకు టాలీవుడ్లోనే ఉండేది. తాప్సీ జీవితం బాలీవుడ్లో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంది. దానికి కారణం ఆమె కష్టం, డెడికేషన్ అని చెప్పుకోవాలి. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నార్త్ లో అలరిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం తరువాత ఆమెకు అవకాశాలు వచ్చాయి. కానీ అవి చాలా వరకు సెకండ్ హీరోయిన్ పాత్రలే.
దాంతో అమ్మడు కాస్త నిరాశకు గురైంది. ఓ క్రమంలో వచ్చిన సినిమాలు కూడా ప్లాప్ కావడంతో టాలీవుడ్లో క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. బాలీవుడ్లో ఈమె పట్టిందల్లా బంగారమే అయింది. తాప్సీ నటించిన ప్రతి సినిమా కొత్తగా ఉండటంతో బీ టౌన్ ప్రేక్షకులు ఆమె సినిమాకు బ్రహ్మరధం పట్టారు. దాంతో అక్కడ స్టార్ గా స్థిరపడిపోయింది. ఇకపోతే తెలుగులో తాప్సి సినిమాలు చేస్తున్న టైంలో టాలీవుడ్ బడా హీరో మోహన్ బాబు సన్ విష్ణుతో ఆమె ప్రేమాయణం నడిపిందట. అయితే ఆ హీరో మాత్రం లైట్ తీసుకున్నారట.
ఈ నేపథ్యంలోనే చాలా దుఃఖంతో, అతగాడిమీద కోపంతో టీ టౌన్ వదలి బీ టౌన్‌కి షిఫ్ట్ అయిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ సందర్భంంలో తాప్సి ఆ హీరోకి శాపనార్థాలు కూడా పెట్టిందట. అవి ఇప్పుడు ఆ హీరో కెరీర్‌కి తగిలి ప్రజెంట్ హిట్ సినిమాలు లేక పర్సనల్ గా బాగా డిస్టర్బ్ గా వున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంతైనా ఆడదాని ఉసురు ఉరికే పోదని పెద్దలు ఈజీగా అనలేదు కదా సోషల్ మీడియా జనాలు మనోడిని బాగా యేసుకుంటున్నారట.