సూర్యుడికే సెగలు పుట్టిస్తున్న గోవా బ్యూటీ.. బికినీలో ఇలియానా అరాచకం!

పిట్ట నడుము సుందరి ఇలియానా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు తెరపై కనబడకున్నా, ఈ మెరుపు తీగను తెలుగు కుర్రకారు అంత త్వరగా మర్చిపోవడం కష్టం. ఎక్కడివరకు ఎన్ని సినిమాలు చేసినా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాతో ఈ అమ్మడు జాతకం మారిపోయింది. ఆ సినిమా తరువాత ఇల్లు బేబీ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్స్ మీద హిట్స్ కొడుతూ… మిగిలిన హీరోయిన్లకు కంటిమీద కునుకు లేకుండా చేసేది.

దాదాపు ఓ పదేళ్లు ఆమె హవానే నడిచింది. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ సినిమా కూడా ఇలియానాని మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ తరువాత కూడా కొన్నాళ్లపాటు ఆమె హవా నడిచింది. ఆ తరువాత బాలీవుడ్ మీద మోజుతో అమ్మడు దుకాణం అక్కడికి మార్చేసింది. మొదట అక్కడ మంచి అవకాశాలు చిక్కినా తరువాత తరువాత అవకాశాలు లేక పాపం అమ్మడు ఖాళీగా గడుపుతోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అందం యొక్క కెపాసిటీని తెలియజేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే టూపీస్ బికీనీలో ఎర్రని సూర్యుని వెలుగులో బీచ్ దగ్గర హొయలు పోయింది. కాగా సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. అవును, ఇల్లు స్కిన్ షోతో బీచ్ లో మంటలు రేపుతోంది. బీచ్ సాక్షిగా హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ రెచ్చగొడుతోంది. ఈ గోవా బ్యూటీ దక్షిణాది ఆడియెన్స్ లో బర్ఫీ అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె టూర్లు, వేకేషన్లకు వెళ్తూ లైఫ్ ను తనకు నచ్చినట్టుగా ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది.

Share post:

Latest