ఆ రోజు నేను యువరాణిలా ఫీలయ్యా..స్టార్ హీరో డాటర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్ త‌న బాయ్ ఫ్రెండ్ తో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
ఐరా ఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపూర్ శేఖర్ తో గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంది. ఆ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించి. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది. ఈ వేడుకకి అమీర్ ఖాన్ సహా అతని కుటుంబ సభ్యులు , బంధువులు అందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఐరా తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

Aamir Khan Kisses Daughter Ira Khan in This Adorable Christmas Click; See Pics

ఐరా ఖాన్ సోషల్ మీడియాలో.. నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎందుకో ఆరోజు అలా అనిపించింది. నన్ను నేను యువరాణిలా అనుకున్నా. ఎలాంటి ఎక్స్ప్రెషన్ తో నైనా.. ఎలాంటి కోణంలోనైనా ఫోటో తీయొచ్చని భావించా. ఆరోజు నేను మరింత అందంగా కనిపించా.. నన్ను అంత అందంగా కనిపించేలా చేసినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికి లవ్ సింబల్ ను జత చేసింది.

ఈ పోస్టుకు బాలీవుడ్ నటీ రియా చక్రవర్తి రిప్లై ఇస్తూ బ్యూటిఫుల్ అంటూ లవ్ ఎమోజీలు పోస్ట్ చేసింది. మరో బాలీవుడ్ నటి జైన్ మేరీఖాన్.. నువ్వు మరింత అందంగా ఉన్నావు అని కామెంట్ చేసింది. మిథిలా పాల్కర్ ఆ రోజు నువ్వు ఎరుపు రంగు డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించావు అంటూ రిప్లై ఇచ్చింది. విజయ్ ఆర్మ ఆ పోస్టుకి హాట్ ఇమేజెస్ తో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)