టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఫాతిమా వివాహ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు. ఫాతిమా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆలీ అల్లుగు బ్యాక్ గ్రైండ్, సంపాదనకు సంబంధించిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
ఆలీ అల్లుడు పేరు షెహ్యాజ్. జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహ్యాజ్. ఈయన ఒక డాక్టర్. ఇతనికి ఓ అన్నయ్య, సోదరి ఉన్నారు. షెహ్యాజ్ వదిన కూడా డాక్టరే. వీళ్లది గుంటూరు. కానీ లండన్ లో సెటిల్ అయ్యారు. షెహ్యాజ్ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. ఆర్థికంగా కూడా బలవంతులు. ఇక ఆలీ కూతురు డాక్టర్ చదివేసరికి.. అల్లుడు కూడా డాక్టర్ కావాలని షెహ్యాజ్ ఎంపిక చేశారట. ఇక షెహ్యాజ్ ఏడాది సంపాదన రూ. 2 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఆలీ అల్లుడు బ్యాక్ గ్రైండ్, సంపాదన తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.