ఆర్తి అగర్వాల్ తండ్రి ఆమెను అంతగా హింసించడానికి కారణం..?

ఎక్కడైనా సరే పిల్లలకు వారి ఆనందం, ఆరోగ్యం, సంపద, త్యాగం చేస్తున్న తల్లిదండ్రులను మనం చూస్తూ ఉంటాము. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏకంగా తమ జీవితాలనే పణంగా పెట్టి మరీ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉంటారు.. అయితే మరి కొంత మంది తల్లిదండ్రులు మాత్రం పిల్లలనే ఆదాయ వనరుగా మార్చి వారి జీవితాలను అతలాకుతలం చేసి.. ఆ తల్లిదండ్రులు ఏమో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా మనం వింటూ ఉంటాము. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో నార్త్ నుంచి వచ్చిన కథానాయికి ల విషయంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది.

Aarthi Agarwal Brother Coming As Hero | cinejosh.com

ఆర్తి అగర్వాల్ జీవితంలో కూడా ఇలాంటి దారుణమైన సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇండస్ట్రీలోకి రావడం ఆర్తి అగర్వాల్ కు ఇష్టం లేకపోయినా డబ్బుకు ఆశపడి ఆమెను సినిమాలలోకి దింపాడు ఆమె తండ్రి శశాంక్ అగర్వాల్. నిజానికి అతడు ఆమెను ఎలా హింసించేవాడు అంటే సినిమాలలో నటించను అని చెబితే చాలు శారీరకంగా ఆమెను దారుణంగా కొట్టి మరీ హింసించేవాడు.” నువ్వు నాకు నచ్చావు” సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ ఉన్నట్టుండి ఈమె బరువు పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు.

Aarti Agarwal's Father Is The Reason Why She Is So Exhausted

అయితే విలాసవంతమైన జీవితానికి బానిస అయిన శశాంక్ అగర్వాల్ డబ్బు లేకపోయేసరికి ఎలాగైనా సరే ఆర్తి అగర్వాల్ ను భర్త నుండి దూరం చేయాలనుకున్నాడు. అలా వివాహమైన ఏడాదికే ఆమె భర్త చేత విడాకులు ఇప్పించి మళ్లీ సినిమాలలో నటించాలని పట్టుపట్టాడు. ఎంతలా అంటే డి గ్రేడ్ సినిమాలలో కూడా నటించమని చెప్పేవాడట. అయితే అందుకు ససేమిరా చెప్పినా అగర్వాల్ ను విపరీతంగా కొట్టేవాడట. చివరికి ఆమె బరువు పెరగడం వల్ల అవకాశాలు రాకపోయేసరికి సర్జరీ చేయించాడు. కానీ ఆ ఆ శాస్త్ర చికిత్స వికటించడంతో ఆమె స్వర్గస్తురాలు అయ్యింది. కానీ డబ్బు కోసం తండ్రి చేతిలో ఆర్తి అగర్వాల్ మరణించడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.