ఎక్కడికి వెళ్లినా అదే అడుగుతున్నారు ఏంట్రా బాబు? ఈ బ్యూటీకి పెద్ద సమస్యే వచ్చి పడిందే..!!

మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయాలు అవసరం. కానీ ఇప్పుడు పరిచయమే అవసరం లేకుండా పాపులారిటీ దక్కించుకుంది సీతగా. మనకు తెలిసిందే ఇప్పుడు జనాలు అమ్మడును మృణాల్ ఠాకూర్ అని పిలవడానికి ఇష్టపడట్లేదు. సీత ..సీత.. సీత అంటూ పిలవడానికే ఇష్టపడుతున్నారు . అంతలా సీతారామం సినిమాతో తన పాత్రను జనాల్లోకి తీసుకెళ్ళింది ఈ హాట్ బ్యూటీ. నిజానికి సీతారామం సినిమా కన్నా ముందు మృణాల్ బోలెడన్ని సినిమాలో నటించింది. కానీ ఏ సినిమా కూడా అమ్మడుకి మంచి పేరు తీసుకురాలేకపోయింది.

అయితే ఎవరు ఊహించిన విధంగా సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ హైలెట్గా నిలిచింది . సినిమాలో రష్మిక మందన లాంటి నేషనల్ క్రష్ ఉన్నా.. కానీ , జనాలు అందరూ మృణాల్ నటనకి ఫిదా అయ్యారు . అంతలా సీత పాత్రలో , ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో మృణాల్ అభిమానులను మెప్పించింది . అయితే సీతారామం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ బాలీవుడ్లో మృణాల్ ఠాకూర్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మడు చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది . అంతే కాదు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న మృణాల్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సీతారామం మూవీ తర్వాత బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చిన మృణాల్.. ఇంటర్వ్యూ కి వెళ్ళిన అందరూ ఒకే ప్రశ్న అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పకు వచ్చింది. ఆమె మాట్లాడుతూ..” సీతారామం సినిమాతో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. సీత పాత్ర నా జీవితం లో ఎప్పుడు గుర్తుండిపోతుంది . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు ..ఈ సినిమా తర్వాత సక్సెస్ మీట్ లో పాల్గొంటున్న ఇంటర్వ్యూలలో ..అందరూ నన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నారు.

మీ వయసెంత..? నా వయసు 30 అనగానే అవునా.. అయితే పెళ్లి చేసుకోండి . ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు..? మన లైఫ్ లో పెళ్లి అంత ఇంపార్టెంట్ అంటారా..? చెప్పండి..!! నేను ఇన్ని ప్రశ్నలు వాళ్ళని అడగలేక ఓకే అంటూ తప్పించుకుంటున్నాను. ఇప్పటికి చెప్తున్నాను నాకు పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు . అంతే కాదు శృంగారం పట్ల కూడా నాకు ఆసక్తి లేదు. కానీ పిల్లలు మాత్రం కావాలి” అంటూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.