RRR సినిమాపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!!

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఇతర భాష సినీ ప్రేక్షకులను సైతం మెప్పించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర దేశాలలో కూడా చాలా మంచి ఆదరణ పొందిన సినిమాగా పేరుపొందింది. ఈ సినిమా ఆస్కార్ బరిలో పెట్టడం కోసం రాజమౌళి చాలా కృషి చేశారని చెప్పవచ్చు. ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా పైన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పలు ఆసక్తికరమైన విషయాలు చేయడం జరిగింది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

NTR : ఎన్‌టీఆర్ సీఎం అవుతారు, ఆయ‌న జాత‌కంలోనే ఉంది.. వేణు స్వామి మ‌ళ్లీ  వ్యాఖ్య‌లు.. - India Daily Live

వేణు స్వామి మాట్లాడుతూ..RRR సినిమాని వెంకటేష్, శ్రీకాంత్ నటించిన సంక్రాంతి సినిమాతో పోల్చారు. రామ్ చరణ్ పాత్ర 100% ఉంటే ఎన్టీఆర్ పాత్ర మాత్రం 20% ఉందని తెలియజేశారు. సంక్రాంతి సినిమాలు వెంకటేష్ నటించిన విధంగా RRR సినిమాలో రామ్ చరణ్ నటించారని తెలిపారు సంక్రాంతి చిత్రంలో శ్రీకాంత్ నటించిన విధంగా RRR చిత్రంలో ఎన్టీఆర్ నటించిన వేణు స్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

RRR movie: Know full form of SS Rajamouli, Ram Charan, Jr NTR's film

ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల వేణు స్వామి మరొకసారి రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టాలని పలువురు నేటిజన్లు సైతం భావిస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన సమయంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్రమైన స్థాయిలో ఆవేదనని వ్యక్తం చేశారు. సినిమాలో ఎక్కువ భాగం రామ్ చరణ్ కి ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్ ను చాలా తక్కువ చేసి చూపించారంటు ఎన్టీఆర్ అభిమానుల సైతం తమ ఆవేదనను తెలియజేశారు. ఇప్పుడు అంతా సద్దుమణుగుతున్న సమయంలో వేణు స్వామి మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.