ఊర్వశి మెరుపులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లో మరొక మలయాళ హీరోయిన్ పగా వేయాలని ఎప్పటినుంచో చూస్తూ ఉన్నది. ఇప్పటికే పది చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మకు మాత్రం పెద్దగా క్రేజ్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అను ఇమ్మాన్యుయేల్. పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్, నాని తదితర హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ దెబ్బతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా కరువయ్యాయి. చివరిగా మహాసముద్రం అనే సినిమాలో చిన్న పాత్రలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అను ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఈ చిత్రంలో గ్లామర్ డోస్ భారీగా పెంచేసిందని చెప్పవచ్చు. ఇక సౌత్ లోనే కాదు ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద సినీ పరిశ్రమగా టాలీవుడ్ ఎదిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Urvasivo Rakshasivo Pre Release Event Stillsఒకవేళ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ ముద్దుగుమ్మ క్లిక్ అయితే వేరే లెవల్లో అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ ఉంటుందని తెలుగు ఆడియన్స్ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్నటి రోజున జరిగిన ఊర్వశివో రాక్షసివో ఈవెంట్ లో కూడా తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది అను ఇమ్మాన్యుయేల్.

వాలెంటైన్ డే గురించి, న‌టుడికి ఏమి వుండ‌కూడ‌దో చెప్పిన నందమూరి బాలకృష్ణ
వైట్ కలర్ డ్రెస్ లో నిండా కలర్ ఫుల్ ఫ్లవర్ డిజైన్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ నిజంగానే ఊర్వశి లాగా కనిపిస్తోందని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈవెంట్ లో అనునే ఒక అట్రాక్షన్ గా మారిపోయింది. అను ఇమ్మాన్యుయేల్ సినిమా కోసం చాలానే కష్టపడిందని హీరో అల్లు శిరీష్ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు విడుదలైన సినిమా ట్రైలర్, టీజర్ రొమాన్స్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఎంతవరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరీ.