షాక్: యంగ్ హీరో రాజ్ తరుణ్.. కాబోయే భార్య లేచిపోయిందా..!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సరైన హిట్ పడటం లేదు. స్టాండప్ రాహుల్ లాంటి ప్లాప్‌ సినిమా తర్వాత రాజ్ తరుణ్ చాలా రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా రాజ్ తరుణ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ వీడియోలో రాజ్ తరుణ్ ‘ఆనందాలు అమ్మాయిలు తన జీవితానికి హానికరం’ ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అనే కీ ఆప్షన్ కూడా జత చేశాడు. ‘ఓ అమ్మాయి గురించి మీ అందరికీ చెప్పటం కోసమే ఈ వీడియో పెడుతున్న అనిస‌.. ‘నా జీవితంలో అమ్మాయిలు గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడూ వస్తుందని తాను అనుకోలేదని’.. ‘నా జీవితానికి ప్రేమ అనేది సెట్ కాదని ఎప్పుడో తేలిపోయింది. దీంతో నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడిగానని చెప్పాడు’.

‘అమ్మా నాన్నలు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి కుదురుచ్చారని పెళ్లి రోజు రాగానే తిరా చూస్తే అమ్మాయి జంప్ అయిపోయిందని.. దీంతో చుట్టాలందరూ సానుభూతి మొదలుపెట్టారు అని రాజ్ తరుణ్ వాపోయాడు’. ‘ఒసేయ్ నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా నీ అంతు చూస్తా నీ ఫోటో ఆన్లైన్లో పెడతా’. ‘ఆమె కనపడితే దయచేసి నాకు చెప్పండి అంటూ రాజ్ తరుణ్ ఈ వీడియోలో వివరించారు’. అయితే రాజ్ తరుణ్ చేసిన ఈ హంగామా అంతా ఓ సినిమా ప్రమోషన్ కోసమే అన్న కామెంట్లు వస్తున్నాయి. అయితే ఆ సినిమా ఏమిటన్న అది మాత్రం రాజ్ తరుణ్ వెల్లడించలేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ కొడతాడా ఈ ప్రమోషన్ మనోడికి ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Raj Tarun (@rajtarunn)