అందుకే నాకు ఆఫర్లు వస్తున్నాయి.. ఓపెన్ గా గుట్టు విప్పిన ప్రగతి ఆంటీ!

నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్స్ మ‌రియు హీరోలకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రగతి ఆంటీకి సోషల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు.

ఒకప్పుడు తన పాత్రలలో ఎంతో హోమ్ లీగా కనిపించిన ప్రగతి ఆంటీ ఇప్పుడు రెబెల్ క్యాండిడేట్ల కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రగతి ఆంటీ ఈ వయసులో కూడా మాస్ డాన్సులు వేస్తూ, జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు అలాగే మోడరన్ డ్రెస్సులు వేసుకొని, లుంగి కట్టుకుని డాన్స్ వేయటం వీడియోలు షేర్ చేస్తూ అందర్నీ అవాక్ అయ్యేలా చేస్తుంది. ఆ వీడియోలు చూసిన కొంత మంది ఆమెను ట్రోలింగ్ చేయడం కూడా జరుగుతుంది.

అయితే ప్రగతి వర్కౌట్లు చేస్తూ జిమ్ లో కష్టపడే వీడియోకి కొంతమంది ఈ వయసులో ఇది అవసరమా? అంటూ కామెంట్ చేయగా, వాటికి కూల్ గా స్పందిస్తూ.. నేను అందంగా కనిపించేందుకు ఇవన్నీ చేయడం లేదు, నేను ఆరోగ్యంగా ఉండేందుకు చేస్తున్నానంటూ సమాధానమిచ్చింది. తాజాగా ప్రగతి ఆంటీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో కనిపించి ఆమె గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

ఈ క్రమంలోనే అప్పటి హీరోయిన్లు ఇప్పుడు తల్లి పాత్రలో నటిస్తున్నారు కదా.. మీకు కాంపిటీషన్ అవుతున్నారా? అని ప్రశ్న అడగగా దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది ప్రగతి. ఆ ప్రశ్నకు స్పందిస్తూ… ప్రగతి తాను అందగత్తెనని కాబట్టే తనకు ఆఫర్లు వస్తున్నాయని ఓపెన్ గా గుట్టు విప్పింది. మీది మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారా? అని అడగగా మనిది మనమే చెప్పుకోవాలి కదా.. మన గురించి ఎవరూ మాట్లాడరు, అన్నట్లుగా ప్రగతి కౌంటర్ వేసింది. ప్రస్తుతం ప్రగతి ఆంటీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.