జపాన్ భాషలో అదరగొట్టిన ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసిన చిత్రం RRR ఈ సినిమా నందమూరి, మెగా అభిమానులతో పాటు ఇండియన్ ప్రేక్షకులకు సైతం మర్చిపోలేని సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని రాజమౌళి ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారని చెప్పుకోవచ్చు. ఇందులో అల్లూరి పాత్రలో రామ్ చరణ్ ,కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. సీతగా ఆలియాభట్ నటించగా.. బ్రిటిష్ ప్రిన్సెస్ గా ఓలివియా నటించింది. ఇక ఇందులో కీలకమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, హీరోయిన్ శ్రియ, నటుడు సముద్రఖని నటించారు. ఇదే చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సరిత తిరగరాసి నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించిందని చెప్పవచ్చు.

RRR in Japan - The South First
తాజాగా ఈ చిత్రాన్ని జపాన్ భాషలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో RRR చిత్రం జపాన్ రాజధాని టోక్యోలో పర్యటిస్తోంది. నిన్నటి ఉదయం నుంచి రామ్ చరణ్ ఉపాసన ,ఎన్టీఆర్ ప్రణతి, రాజమౌళి తదితరులు సైతం ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా చేసినట్లుగా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఎన్టీఆర్ టోక్యో వీధుల్లో దోస్తీ పాటకు సందడి చేస్తూ రోడ్డును దాటుతూ ఉండే వీడియోను రామ్ చరణ్ పోస్ట్ చేయడం జరిగింది.

SS Rajamouli, Jr NTR and Ram Charan promote RRR with Japanese media ahead  of release. Pics here! - India Today
అయితే తాజాగా ఎన్టీఆర్ అభిమానులు మరొక వీడియోను నెట్టింట వైరల్ గా చేశారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టోక్యోలో RRR టీమ్ మీడియా ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఎన్టీఆర్ జపాన్ భాషలో మాట్లాడి అక్కడివారిని బాగా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ జపాన్ భాషలో మాట్లాడడంతో అక్కడున్న అభిమానులు ప్రేక్షకులు సైతం చాలా సంబరపడిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.