NBK 107 సూపర్ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్..టైటిల్ ఇదే..!!

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులలో పూనకాలు వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటారు బాలయ్య. ఇక ఈ మధ్యకాలంలో ఆహా లో అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటూ ఉన్నారు.బాలయ్య చివరిగా అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా తను 107వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది.

 అఖండ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని టాక్. అది అలా ఉంటే ఈ సినిమా టైటిల్‌పై రకరకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీమ్ క్లారిటీ ఇవ్వనుంది. ఈ సినిమా టైటిల్‌న కర్నూలులోని కొండా రెడ్డి బురుజు దగ్గర కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ట్యాగ్ లైన్‌గా ‘గాడ్ ఆఫ్ మాసెస్ అని పెట్టారు. Photo : Twitter
ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. ఇక ఈ సినిమా పోస్టర్, డైలాగ్, టీజర్ లాంటివి చూసి అభిమానుల సైతం ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ పైన చాలా అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా టైటిల్ని విడుదల చేయడం జరిగింది. NBK 107 వీరనరసింహారెడ్డి బాస్ ఆఫ్ మాసేస్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

 ఇప్పటికే విడుదల చేసిన NBK 107  ఫస్ట్ లుక్, టీజర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది.  గతేడాది చివర్లో  బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్‌తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. (Twitter/Photo)

బాలయ్య గెటప్ కు ఆ స్వాగ్ కు పెట్టిన పేరు చుస్తే చెన్నకేశవరెడ్డి సినిమా రోజులు గుర్తుకొస్తున్నాయంట అభిమానులు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో కూడా డ్యూయల్ రోల్ చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా మొత్తం 11 ఫైట్లు ఉన్నాయని టాక్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ వైరల్ గా మారుతొంది.