సర్ప్రైజ్: కళ్యాణ్ రామ్.. కొత్త మూవీ నుంచి క్రేజీ అప్డేట్..!

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా ఏకంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది… టాలీవుడ్ కి కం బ్యాక్ ఇచ్చింది. ఇంతటి భారీ విజయం తర్వాత కళ్యాణ్ రామ్ తను తర్వాతి సినిమాలు గురించి ఎటువంటి సమాచారం లేదు. బింబిసార సినిమాకి పార్ట్ 2 కూడా రానుంది.. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతుంది. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ తాజాగా ఈరోజు తన కెరియర్ లోనే 19వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

NKR19 Look | కల్యాణ్ రామ్ కొత్త సినిమా అప్‌డేట్..సర్‌ప్రైజ్ లుక్ అదిరింది

ఎన్ కె ఆర్ 19 గా వస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఈ ఫస్ట్ లుక్ లుక్ పోస్ట‌ర్‌లో కళ్యాణ్ రామ్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాని రాజేందర్ రెడ్డి అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.