కాంతారా మొదటి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన కాంతారావు సినిమా నిన్నటి రోజున తెలుగుతోపాటు, మలయాళం హిందీ వంటి భాషలలో చాలా గ్రాండ్గా విడుదల అయింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం కన్నడలో కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇతర భాషలలో కూడా విడుదల చేయగా ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగానే రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం తెలుగులో రూ.2 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ అధినేత అల్లు అర్జున్ తెలుగు థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

kantara movie, Rishab Shetty: ಸಿನಿಪ್ರಿಯರ ಮನಗೆದ್ದ 'ಕಾಂತಾರ' ಚಿತ್ರದ 'ಸಿಂಗಾರ  ಸಿರಿಯೆ' ಹಾಡು - rishab shetty sapthami gowda starrer kantara movie first  song released - Vijaya Karnataka

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ కాంతారావు చిత్రం కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది. హిందీలో శుక్రవారం రోజున ఈ చిత్రం విడుదల అయింది. అయితే విడుదలైనప్పుడు పెద్దగా థియేటర్లు ఇవ్వలేదు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం రూ.1.3 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించినట్లు సమాచారం దీంతో థియేటర్ల సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రెండవ రోజు ఏకంగా రూ.2.25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం దీంతో దాదాపుగా నార్త్ లో రెండు రోజులలోనే సుమారుగా ఈ చిత్రానికి రూ.3.5 కోట్ల రూపాయలు రాబడినట్లు తెలుస్తోంది.

ఇక కర్ణాటకలోని కామ్లా, భూతకోల సాంప్రదాయం అటవీ సాంస్కృతిక నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. హాంబలే ప్రొడక్షన్ నిర్మానణం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణీయంగా నిలిచాయి . ఈ చిత్రంలో హీరోయిన్ సప్తమి గౌడ కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఇక కనడ నాట సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.114 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్లు రెండు నిపుణులు తెలియజేస్తున్నారు.