కళ్యాణ్ రామ్ కోసం తారక్ ఇన్ని త్యాగాలు చేశారా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాలను అందుకున్న నేపథ్యంలో ఆయన తన తర్వాత ప్రాజెక్ట్ ఆలస్యం అయినా సరే ఖచ్చితమైన సక్సెస్ పొందే కథతోనే ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ క్రమంలోని తన కథల ఎంపిక విషయంలో ఆలస్యమైనా పర్లేదు మంచి కంటెంట్ ఉండాలి అని దర్శక నిర్మాతలకు ముందే చెబుతున్నారు. ఎన్టీఆర్ కి తన సోదరుడు కళ్యాణ్ రామ్ అంటే ఎంతో ప్రేమ.. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ రామ్ తన సినిమాలలో మెజారిటీ సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరించాడు. కళ్యాణ్ రామ్ నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఆర్థికంగా నష్టం కలిగించాయి.

అయితే తన సోదరుడిని ఆదుకోవాలని ఆలోచనతో ఎన్టీఆర్ తను హీరోగా తెరకెక్కిన జైలవకుశ సినిమాను నిర్మించే అవకాశాన్ని కళ్యాణ్ రామ్ కి ఇచ్చారు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అవ్వడంతో పాటు నిర్మాతగా కళ్యాణ్ రామ్ కి కూడా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అంతేకాదు కళ్యాణ్ రామ్ కు మరింత బెనిఫిట్ కలగాలని ఆలోచనతో ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలలో కూడా కళ్యాణ్ రామ్ కు భాగస్వామ్యం ఇచ్చారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా భారీ బడ్జెట్ తో తెరెకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు కూడా కళ్యాణ్ రామ్ నిర్మించడానికి భాగస్వామ్యం ఇప్పించారు ఎన్టీఆర్.

మరి ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా భారీ స్థాయిలో లాభం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అని అందరూ అనుకుంటున్నారు. తన అన్న కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్న ఎన్టీఆర్ దానికి తగ్గ ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి. మరొక త్యాగానికి కూడా ఎన్టీఆర్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఎందుకంటే తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మించే ఏ సినిమాకి కూడా తను పారితోషకం తీసుకోకుండా నటించాలని నిర్ణయించుకున్నారట.ఎన్టీఆర్ వల్లే కళ్యాణ్రామ్ హీరోగా, నిర్మాతగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇటీవల విడుదలైన బింబిసార సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆయన తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు సమాచారం.